![]() |
![]() |
.webp)
ఆర్జే కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో అందరికీ కాజల్ గా తెలుసు కానీ ఈమె అసలు పేరు రహిమునిస్సా మెహ్ సబీనా. ఈమె వాగుడుకాయ, యూట్యూబర్, రేడియో జాకీ, వీడియో జాకీ, సింగర్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ , యాక్టర్ ఒక్కటేమిటి మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటుంది. ఈ టాలెంట్స్ అన్ని కాజల్ సొంతం. బిగ్ బాస్ హౌజ్ లో 17 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన కాజల్ బుల్లితెర అభిమానుల మెప్పు పొందింది కూడా. ఈమె వాయిస్ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. అలాంటి కాజల్ సోషల్ మీడియాలో కూడా లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటుంది. తన ఇంట్లో చేసే పనులు, ఫంక్షన్స్ గురించి అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక ఇప్పుడు కాజల్ లేటెస్ట్ గా ఒక అప్ డేట్ పోస్ట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ లో. అందులో తన హజ్బెండ్ సోఫాలో కూర్చుని ఉండగా కాజల్ ఆయన ముందర డాన్స్ చేస్తూ ఉంది. "రోజూ మా ఇంట్లో ఇలానే ఉంటుంది. నేను ఇలా నా హజ్బెండ్ ముందు డాన్స్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను. నేను చేసే డాన్స్ ని నా కూతురు సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఇదిగో ఇలా వీడియోలు తీస్తూ ఉంటుంది. వీడియోస్ తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటుంది..కానీ నేను వాటిని నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాను" అంటూ ఒక కాప్షన్ కూడా ఫన్నీ ఎమోజిస్ తో పెట్టింది. ఇక ఈ వీడియోకి నెటిజన్స్ కామెంట్స్ మాములుగా లేవు. "పాపం ఆయన ఎలా భరిస్తున్నాడో...మీరు మీ అమ్మాయితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు కదా.. మీకు ఎంత పెద్ద నోరు ఉంటే మాత్రం ఆయనతో అలా ఆదుకోవడం కరెక్టేనా " అని కామెంట్స్ పెట్టారు ఇక సిరి హన్మంత్ "పాపం విజయ్" అంటే నటుడు ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ "క్యూట్" అని కామెంట్ చేసింది.
![]() |
![]() |